Uttam Kumar Reddy: బీజేపీ నోటీసులకు భయపడేది లేదు.. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. రాష్ట్ర సాగునీరు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల నోటీసులు కక్ష సాధింపు చర్యలు అన్నారు. బీజేపీ దేశంలో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు, ఈడీ, సీబీఐ లతో బెదిరించాలని చూస్తుందన్నారు. ఫేక్ వీడియోలో అంటూ నోటీసులు పంపుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆ వీడియోలతో సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. నోటీసులకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వడం ఖాయమన్నారు.
Read also: Shobha Shetty : కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన శోభా శెట్టి..
కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. మే 1న ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరుకావాలని కోరారు. అమిత్ షాకు సంబంధించిన ఈ ఫేక్ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ హ్యాండిల్ షేర్ చేసింది, ఆ తర్వాత చాలా మంది పార్టీ నాయకులు ఈ వీడియోను రీ పోస్ట్ చేశారు. ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం కావడంపై బీజేపీ, హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదులతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: CM YS Jagan: ఉత్సాహంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం.. నేడు మూడు జిల్లాలో పర్యటన
కాగా.. ఎన్నికల వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా కొన్ని ఫేక్ వీడియోలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల అస్త్రంగా మల్చుకుని బీజేపీపై విమర్శలు గుపిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. ఈ ఇష్యూపై ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే..
Nothing phone 2a Price: ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. భారత కస్టమర్ల కోసమే!