Dharmapuri Arvind: రేవంత్ రెడ్డి నిన్న ఒక గుడ్డు మోసిండు… ఇంకా ఆరు గుడ్ల గురించి చెప్పలేదని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ లో ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు అన్నారు. మీరు అంతర్జాతీయ సంస్థతో లెక్కలేయండి ఫ్యాక్టరీ నెల రోజుల్లో తెప్పిస్తా అన్నారు. మోడీ తాను బ్రతికున్నంత వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇచ్చే సమస్య లేదని తెలిపారు. మతతత్వ రిజర్వేషన్లు ఉండవు.. ఎకనామికల్ బ్యాక్ వార్డ్ అన్ని కులమతాలకు చెందిన వారికి రిజర్వేషన్లు ఉంటాయన్నారు.
Read also: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం!
మోడీ పాలనలో ఏక్ మియకు ఏక్ బిబి.. కుటుంబ నియంత్రణ ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి నిన్న ఒక గుడ్డు మోసిండు… ఇంకా ఆరు గుడ్ల గురించి చెప్పలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయి గుడ్లు మోస్తుంటే.. పెద్దమనిషి చెప్పాల్సింది పోయి జీవన్ రెడ్డి ఆయన కూడా గుడ్లు మోస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ముస్లిం రాజ్యం అయిపోయి.. దేశం మూడు ముక్కలవుతుందన్నారు. అధికారం ఉంది కదా అని తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చారించారు.
Read also: Rafa: నెతన్యాహుకు షాక్.. ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని సమస్యలపై డిమాండ్లు పరిష్కరించాలని కోరితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు ఇటీవల గాంధీభవన్ వద్ద ప్రదర్శన నిర్వహించిన విషయం సంగతి తెలిసిందే. ఇప్పుడు మేడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీజేపీపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఒక్కటే అడ్డంకి అని సీఎం రేవంత్ రెడ్డి సెటైరికల్ గా ట్వీట్ చేశారు. బీజేపీ తెలంగాణకు ఇచ్చింది ఇది అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన తలపై ఒక బాక్స్ పెట్టుకుని దానిపై గాడిద గుడ్డు అంటూ అని రాసిన ఫోటోతో ట్వీట్ వైరల్ గా మారింది.
Vote at Home: హోం ఓటింగ్ ప్రక్రియ షురూ..