OTR: ఫార్ములా-ఈ- కేసులో కేటీఆర్ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ రాజకీయవర్గాల్లో ఎవరికి తోచినరీతిలో వారు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరని అన్నారు కేటీఆర్. ఆ కేసులో ఏమి లేదని రేవంత్‌కి తెలుసన్న కేటీఆర్…గవర్నర్ అనుమతి అవసరం లేకున్నా కావాలని పంపారని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని కేటీఆర్ గవర్నర్ లీగల్ ఒపీనియన్…
తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీకి పోయేది.. మాజీ సీఎం కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటును 7.25కి కుదించడానికే వెళ్లాలని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల చరిత్ర కూడా అందరికీ తెలియాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం కోసం రూ.87,449 కోట్లు అప్పు తెచ్చారన్నారు. 11.5 వడ్డీతో 14 ఏళ్లకు కేసీఆర్ అప్పు తెచ్చాడని.. యూబీఐ, నాబార్డు…