OTR: ఫార్ములా-ఈ- కేసులో కేటీఆర్ విచారణకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం ప్రకటించారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ రాజకీయవర్గాల్లో ఎవరికి తోచినరీతిలో వారు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్‌లో కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయరని అన్నారు కేటీఆర్. ఆ కేసులో ఏమి లేదని రేవంత్‌కి తెలుసన్న కేటీఆర్…గవర్నర్ అనుమతి అవసరం లేకున్నా కావాలని పంపారని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగని కేటీఆర్ గవర్నర్ లీగల్ ఒపీనియన్ కోసం పంపడంతో పది వారాలు పట్టిందన్నారు. దానిని అలా సాగదీయాలని చూస్తున్నారని కామెంట్ చేశారు.
READ ALSO: OTR: వైసీపీ దూకుడు.. విశాఖ కూటమి నేతలు సైలెంట్ మోడ్
అరెస్టు చేసే ధైర్యం సీఎం రేవంత్ చెయ్యరని కేటీఆర్ ఎందుకన్నారన్నదానిపై రకరకాల చర్చ సాగుతోంది. తనను అరెస్ట్ చేస్తే…జనంలో సింపతీ వస్తుందని…అది రేవంత్ కు నచ్చదని…కేటీఆర్ ఆలోచనగా కొందరు చెబుతున్నారు. ఎందుకంటే, అరెస్టయి జైల్లో వుండివచ్చినవారిలో చాలామంది సీఎంలు అయ్యారు. అరెస్టును పొలిటికల్ అడ్వాంటేజ్‌గా మలచుకునే అవకాశం వుంది. అందుకే అరెస్టు చేసే డేర్ చెయ్యరన్నది కేటీఆర్ కాన్ఫిడెన్స్‌గా కొందరు భావిస్తున్నారు. అరెస్ట్ చేసి…అనవసరంగా జనంలో హీరోను చేసే బదులు…రాజకీయంగానే కట్టడి చేసి….జనంలో అవినీతి ముద్ర వేస్తే చాలు అని పాలకపార్టీ భావిస్తోందని కేటీఆర్ అనుకుంటున్నట్టుగా చర్చించుకుంటున్నారు. అందుకే తనను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ చెయ్యరని కేటీఆర్ అన్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
READ ALSO: Off The Record: కోల్డ్‌వార్ సోషల్ మీడియా సృష్టే.. విభేధాల్లేవని బండి, ఈటల ప్రకటన!