తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి…