ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈనెల 6న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తొలుత శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశకు గురయ్యారు. Devineni Uma : ఆ విషయంలో జగన్…
సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం ఉదయం విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం 685 మంది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఐఏఎస్‌కు 180, ఐఎఫ్ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. శృతి శర్మ ఆలిండియా నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. అంకిత అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్మా మూడో ర్యాంక్ సాధించారు. పూర్తి ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Technology: కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తున్నారా?…
ఇటీవలే కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. 144 వార్డులున్న కోల్‌కతా కార్పొరేషన్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 7 చోట్ల విజయం సాధించి 114 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేవలం 4 చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉన్నది. కాంగ్రెస్, వామపక్షాలు తలా రెండు చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. Read: వైరల్: నెటిజన్ల…
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. ఇంటర్ ఫలితాల్లో తప్పుడు నిర్ణయాల వల్లే 23 మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సారి జరిగిన ఇంటర్ పరీక్షల్లో నెలకొన్ని గందరగోళాన్ని సరిదిద్దాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమైన విషయం తెలిసిందేనని గుర్తు…
తెలంగాణలో ఇంటర్ విద్యార్ధులకు ఇంటర్ బోర్డ్ షాకిచ్చింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దు… నూరేళ్ల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ క్లాసులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం. ఫెయిలైన విద్యార్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులే అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున వెలువడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినా విజయం సాధించలేకపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో అందరికంటే భారీగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 3012 ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకొవచ్చు. 2018 లో జరిగిన…
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం 22వ రౌండ్ లో కూడా బీజేపీ హవా… బీజేపీ 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ 83,167 ఓట్లు. 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఈటల 21వ రౌండ్ లోనూ బీజేపీ హవా. బీజేపీ 1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు. 21వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం. 20వ రౌండ్ లోనూ బీజేపీ హవా… 20వ రౌండ్ లో బీజేపీ కి 1,474 ఓట్ల ఆధిక్యం…