రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. చాపకింద నీరులా చకచక మార్పులు, చేర్పులు జరిగిపోతుంటాయి. ఇందుకు బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలే ఉదాహరణ. నిన్నటిదాకా నితీష్‌కుమార్ నాయకత్వంలో సాఫీగా సాగిపోతున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఒక్కసారిగా సంక్షోభం తలెత్తింది.
బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ నితీశ్ కుమార్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఇప్పటి వరకూ ఉన్న ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.