ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజల్ బుధవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే అనిల్ బైజల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ కు ఆయన రాజీనామాను సమర్పించారు. ఢిల్లీకి సుదీర్ఘ కాలం ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. 2016 డిసెంబర్ 31న పదవీ బాధ్యతలు చేపట్టిన బైజల్ ఐదేళ్ల నాలుగు నెలలు ఎల్జీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్…