రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దేశ వృద్ధి రేటుకు సంబంధించి ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ అంచనా ప్రకారం.. FY 25కి దేశ జీడీపీ వృద్ధి తక్కువగానే ఉండవచ్చు. ఈ సమావేశంలో 25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గవర్నర్ 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కాల్ రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు చేయబడింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను లష్కరే తోయిబా సీఈఓనని చెప్పాడు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఈ కాల్ వచ్చింది. ఫోన్‌లో ఉన్న వ్యక్తి.. "నేను లష్కరే తోయిబా సీఈఓని, బ్యాక్‌వే మూసేయండి. ఎలక్ట్రిక్ కారు చెడిపోయింది." అని చెప్పాడు.
Banking Liquidity: ఆగస్టు నెలలో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ గణనీయంగా తగ్గి పోయిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో (ఆగస్టు 2న) బ్యాంకింగ్ లిక్విడిటీ 2. 86 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఆగస్టు 16వ తేదీ నాటికి 1.55 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది.
RBI: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అలాగే నేటి నుంచి బ్యాంకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
UPI in Other Countries: భారతదేశ దేశీయ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూపీఐ కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల చాలా దేశాలు యూపీఐని స్వీకరించాయి. ఇప్పుడు జపాన్, అనేక పాశ్చాత్య దేశాలు యూపీఐ లింకేజీపై ఆసక్తి చూపుతున్నాయి.
Silver Loan: దేశంలోని బ్యాంకులు బంగారం రుణం మాదిరిగా వెండి రుణం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని ఆర్‌బిఐని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఉన్న గోల్డ్ మెటల్ లోన్స్ (జిఎంఎల్) తరహాలోనే సిల్వర్ మెటల్ లోన్స్ (ఎస్‌ఎంఎల్)కి కూడా కొత్త విధానాన్ని రూపొందించాలని బ్యాంకులు చెబుతున్నాయి.
RBI: ఏ కరెన్సీ నోట్లనైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. అయితే నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నోట్లకు సంబంధిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీంతో మీరు కొత్త నోట్లను పొందవచ్చు.
Safest Banks List: ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఈ డబ్బు ఆపద కాలంలో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు సంపాదించిన సొమ్ములో కాస్త పొదుపు చేసుకుంటారు. అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు బ్యాంకు కూడా దివాలా తీస్తుంది.
ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖ ఎక్కడుందో తమకు తెలుసని.. అయినా 2016లో ప్రధాని మోదీ సర్కారు ప్రకటించిన నోట్ల రద్దు అంశాన్ని పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.