Reservation: హర్యానాలో మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన వివాదాస్పద బిల్లును పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టేసింది. ప్రైవేట్ రంగంలో రాష్ట్ర నివాసితులకు 75 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేసే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్ యాక్ట్ 2020లో ఆమోదించిన తర్వాత అనేక మార్పులకు గురైంది. ఈ చట్టం ద్వారా నెలవారీ జీతం రూ.30,000 కన్నా తక్కువ ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో…