కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించడంపై ఘాటుగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.
కర్ణాటక రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు.. మే 9వ తేదీ వరకు ముస్లింలకు రిజర్వేషన్లను రద్దు చేసే ప్రక్రియలో కర్ణాటక ప్రభుత్వ ప్రమేయం ఉండకూడదని ఆదేశించింది.
ప్రతిష్టాత్మకమైన అగ్నిపథ్ పథకానికి అనుగుణంగా సరిహద్దు భద్రతా దళంలో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులతో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకుంటే టిక్కెట్ రేట్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ తీసుకొచ్చింది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.. రిజర్వేషన్లు ఆర్థిక సమానత్వం కోసం కాదు, ప్రాతినిథ్యం కోసమేనని పిటిషనర్లు వాదించారు.. ఆర్థిక వెనుకబాటు తనం రిజర్వేషన్ల కల్పనకు ఆధారం కాదంటున్నారు.. 50 శాతం రిజర్వేషన్ల…
లిక్కర్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపటి క్రితమే విడుదల చేశారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్.. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వం ఏ- 4 రిటైల్…