ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు ఇప్పట్లో బయటికి వచ్చే ఛాన్స్ లు కనిపించడం లేదు.. సొరంగంలో వారిని బయటకు తీసుకు వచ్చేందుకు గత వారం రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. సాంకేతిక సమస్యలతో లోపలికి వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు.