భారత రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ అద్భుతంగా ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో భద్రతా బలగాలు, వివిధ రాష్ట్రాల శకటలు, ఆయుధ ప్రదర్శనలు సంగీత ప్రదర్శనలు కళ్లు తిప్పుకోకుండా సాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. అంతటి ప్రాధాన్యమున్న పరేడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Republic Day: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మోహరించాయి. రిపబ్లిక్ డే పెరేడ్ ను దాదాపుగా 65,000 మంది వీక్షిస్తారని ఢిల్లీ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన సర్కిళ్లలో స్నిఫర్ డాగ్ లు, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వీరికి…
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి మంగళవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.