Secunderabad: మరో 36 నెలల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రూ.699 కోట్ల వ్యయంతో చేపట్టింది. ఈ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. ఈ నిర్మాణ పనులకు సంబంధించి తుది మెరుగులు తీర్చిదిద్దే బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి రైల్వేశాఖ అప్పగించింది. భవన నిర్మాణ రూపకల్పన ప్రూఫ్ కన్సల్టెంట్‌గా ఐఐటీ ఢిల్లీని నియమించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా…