(ఫిబ్రవరి 20న విజయనిర్మల జయంతి)నటిగా, దర్శకురాలిగా ఆ తరం వారిని అలరించారు విజయనిర్మల. లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన విజయనిర్మల ఈ తరం వారి మదిలోనూ చోటు దక్కించుకున్నారు. ఆమె పేరు వినగానే నటశేఖర కృష్ణ, ఆయన గుర్తుకు రాగానే విజయనిర్మల తెలుగువారి మదిలో మెదలుతారు. అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పేరుకు ‘విజయకృష్ణులు’ సార్థకత చేకూర్చారు అనిపిస్తుంది. ఇద్దరూ నటనలోనూ, దర్శకత్వంలోనూ రాణించారు. అలాంటి జంట మరొకటి…