మహారాష్ట్ర, కర్ణాటకలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటకలో వర్షాలపై సీఎం బసవరాజ్ బొమ్మై అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ReadAlso: YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ…
దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, అమలు చేస్తున్నారు. పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. సినిమా హాళ్లు బంద్ చేశారు. ఇక 50 శాతం సీటింగ్‌లో రెస్టారెంట్లు, మెట్రోలు నడుస్తున్నాయి. కార్యాలయాలు సైతం 50 శాతం మంది ఉద్యోగులతోనే నడుస్తున్నాయి. మిగతా రాష్ట్రాల కంటే ఢిల్లీలో వేగంగా కేసులు పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలను కఠినం చేసేందుకు…
బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర తీరం వద్దకు దూసుకువస్తోంది. ఉత్తర దిశగా కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజులు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 80-100 కి.మీ. వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్, ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక చెన్నైని వర్షాలు ముంచెత్తున్నాయి. చలి, వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. Read: దేశంలో చమురుధరలు దిగిరాబోతున్నాయా? ఇన్ని రోజులుగా, ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇప్పటి వరకు చూడలేదని, భారీ వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం వాయుగుండంగా మారి చెన్నైపై తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇప్పటికీ 10 రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురియడంతో తమిళనాడులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు సీఎం ఎంకే స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన సంప్రదించాలని సూచిస్తూ.. కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు…
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదలతో జనజీవనం స్తంభించింది. వర్షప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీనుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్11 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిం చింది. ఒక వేళ ఇప్పటికే ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే వారిని వెంటనే వెనక్కి తిరిగి రావాలని…
ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయింది. బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక చమోలీ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గతేడాది చమోలీ జిల్లాలో పెద్ద ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడటంతో…
తెలంగాణపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. హైదరాబాద్‌లో గంటల తరబడి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురుస్తుండగా.. జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ తెల్లవారుజాము నుంచే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.. మధ్యాహ్నం వరకే తెలంగాణలో 15 సెంటీ మీటర్లు, హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3 సెంటీ మీటర్ల వర్షం నమోదు కాగా.. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అని ఎన్టీవీతో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా అలుముకున్న క్యూములో నింబస్ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయి. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అని తెలిపారు. కాబట్టి ఆ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా 16 జిల్లాలకు…