Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
- అఫ్గానిస్థాన్‌తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్
- టెస్టుల్లో నంబర్-3పై గంభీర్ క్లారిటీ
- రిషభ్ పంత్‌పై గౌతీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir on Sai Sudharsan and Rishabh Pant: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ముందు పలు కీలక అంశాలపై స్పందించాడు. ముఖ్యంగా టెస్టుల్లో నంబర్-3 బ్యాటింగ్ స్థానం, వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పాత్ర, అలాగే జట్టులో స్పిన్నర్ల ఎంపికపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది.
చేతేశ్వర్ పుజారా తర్వాత భారత టెస్టు జట్టులో నంబర్-3 స్థానానికి సరైన వారసుడు ఇంకా దొరకలేదు. ఈ నేపథ్యంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు అవకాశమివ్వాలని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘సాయి సుదర్శన్‌కు ఇప్పటివరకు సరైన అవకాశాలు రాలేదు. అతను ఎక్కువగా ఇంగ్లండ్ పరిస్థితుల్లోనే ఆడాడు. అతనికి న్యాయం జరిగేలా తగిన అవకాశాలు ఇవ్వాలి. ఐపీఎల్లో 700 పరుగులు చేశాడు. కేవలం నాలుగు లేదా ఐదు మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాడిని అంచనా వేస్తే భవిష్యత్తుకు బలమైన జట్టును నిర్మించలేం’ అని గంభీర్ పేర్కొన్నాడు.
Also Read
- India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
- Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి రిషభ్ పంత్‌ను తొలగించడంపై కూడా గంభీర్ స్పందించాడు. పంత్ తన సహజ ఆటను మార్చాల్సిన అవసరం లేదని, కానీ మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడటం నేర్చుకోవాలని సూచించాడు. ‘మేము రిషభ్ పంత్‌ను మార్చాలని అనుకోవడం లేదు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడడం చాలా ముఖ్యం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ప్రతి ఆటగాడి బాధ్యత’ అని గంభీర్ చెప్పాడు. యువ స్పిన్నర్లు మనవ్ సుతార్, హర్ష్ దూబేలకు తొలి టెస్టు పిలుపు రావడంపై మాట్లాడుతూ.. శ్రీలంక పర్యటనకు భారత జట్టు నాలుగు స్పిన్నర్లతో వెళ్లే అవకాశం ఉన్నందున, ఈ టెస్టు ద్వారా నాలుగో స్పిన్నర్‌ను ఎంపిక చేస్తామని తెలిపాడు. ‘మనవ్, హర్ష్ ఇద్దరూ ఎడమచేతి స్పిన్నర్లే అయినప్పటికీ వారి బౌలింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఈ మ్యాచ్ మాకు నాలుగో స్పిన్నర్‌ను గుర్తించే మంచి అవకాశం. శ్రీలంకలో నాలుగు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నాం’ అని వెల్లడించాడు.
భవిష్యత్ టెస్టు సిరీస్‌ల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గంభీర్ చెప్పాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ వంటి విదేశీ పర్యటనల కోసం జట్టును మెరుగ్గా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. కొంతమంది వన్డే రెగ్యులర్ ఆటగాళ్లను టెస్టు ప్రణాళికల్లో భాగంగా ఉపయోగిస్తామని, టెస్టు క్రికెట్‌కు ప్రత్యేకంగా సన్నద్ధమవుతామని గౌతీ స్పష్టం చేశాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా నంబర్-3 స్థానంలో సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కుతుందా?, నాలుగో స్పిన్నర్‌గా ఎవరు ఎంపిక అవుతారు? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..