దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోరుకు బ్రేకులు పడ్డాయి. గత వారం రికార్డుల మోత మోగించిన సూచీలు.. ఈ వారం మాత్రం ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్‌పై ప్రభావం చూపించడంతో బుధవారం ఉదయం నష్టాల్లోనే సూచీలు ప్రారంభమయ్యాయి.