Pallavi Prashanth Arrest : పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై బిగ్ బాస్ కౌశల్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్లవి ప్రశాంత్..సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు ఇది. రైతు బిడ్డగా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి పల్లవి ప్రశాంత్ ఏకంగా సీజన్ 7 టైటిల్ ను గెలుచుకున్నాడు..అయితే అంతవరకు బాగానే వుంది.. కానీ అతడిని విజేతగా అనౌన్స్ చేసిన తరువాత ఫ్యాన్స్ విధ్వంసం సృష్టించారు.బిగ్‌బాస్ టైటిల్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి ఊరేగింపుగా బయలుదేరాడు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్ కూడా బయటకు రాగా, ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అనుదీప్ కారుపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మరో కంటెస్టెంట్ అశ్విని కారు అద్దాలను కూడా పగులగొట్టారు. రోడ్డుపై వెళ్తున్న 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతోపాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగులగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ1గా ప్రశాంత్, ఏ2గా మనోహర్, ఏ3గా అతడి స్నేహిడుతు వినయ్ ను కూడా చేర్చారు. ఇప్పటికే ఏ4గా ఉప్పల్‌కు చెందిన సాయికిరణ్ మరియు అంకిరావుపల్లి రాజును అరెస్ట్ చేసిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ను , మనోహర్‌తో పాటు 14 మందిని అదుపులోకి తీసుకుని కోర్ట్ ముందు హాజరు పరిచారు.తాజాగా ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల ముందు విచారణకు ఆదివారం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే.. రూ.15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కూడాకోర్టు తెలిపింది. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అతనికి సపోర్ట్ గా నిలిచారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ ఈ విషయం పై స్పందించాడు..సామాన్యుడిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం బాధాకరం.. అతను ఎంతో అమాయకుడు.. కొంతమంది పబ్లిసిటీ కోసం అలా దాడి చేయడం చేసారు.ప్రశాంత్ కేవలం తనకి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని కలవాలి థాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఫ్యాన్స్ ను పలుకరించడానికి తిరిగి వచ్చిఉంటాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకూడదు. అది పూర్తిగా చట్ట వ్యతిరేక చర్య అవుతుంది. కానీ ఆ దాడికి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదు. అని కౌశల్ ప్రశాంత్ కు సపోర్ట్ గా నిలిచాడు..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!