విశ్వక్ ఓవర్ యాక్షన్ తగ్గించు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పాగల్’… హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. వాటిలో హిట్స్ అంటే ఒక్క ‘హిట్’ మాత్రమే. అదీ ఓ మాదిరి హిట్. అంతకు ముందు చేసిన వాటిలో ‘ఫలక్ నుమా దాస్’ సో..సో. అయితే ఇతగాడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇటీవల అతను పాల్గొన్న వేడుకల్లో స్పీచెస్ వింటే అది ఇట్టే అర్థం అవుతుంది. అప్పుడే తానో సూపర్ స్టార్ అయినట్లు ఫీలవుతుంటాడు. విజయ్ దేవరకొండ స్థాయిలో ఇమేజ్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తుంటాడు. డైలాగులన్నీ అతిగానే ఉంటుంటాయి. కొంచెం జూనియర్ పోలికలతో ఉండటంతో తారక్ ఫ్యాన్స్ లైక్ చేస్తుంటారు. తాజాగా అతను నటించిన సినిమా ‘పాగల్’ విడుదలకు ముందు ఓ సవాల్ విసిరాడు విశ్వక్. ‘పాగల్’ హిట్ అవకపోతే పేరు మార్చుకుంటాననేశాడు. లాక్ డౌన్ తో మూత పడిన థియేటర్లు అన్నీ ‘పాగల్’తో మళ్ళీ తెరుచు కుంటాయని, అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానన్నదే దాని సారాంశం.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
‘పాగల్’ మూవీ శనివారం రిలీజ్ అయింది. హీరోగా నటించిన విశ్వక్ చెప్పినట్లుగా హిట్ టాక్ ఎక్కడా లేదు. పైగా థియేటర్ కి వచ్చి సినిమా చూసిన సగటు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీంతో విశ్వక్ ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లో మాట్లాడిన మాటలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సినిమా ఫస్ట్ షో పూర్తి కాగానే ప్రచారం ఆపేయవచ్చు అని ఇతగాడి స్నేహితులు చెప్పారట. అది కాన్ఫిడెన్స్ అనాలో ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో అర్థం కావటం లేదు. మన స్టార్ హీరోలు కూడా ఇలా మాట్లాడటానికి ధైర్యం చేయరేమో. ‘కష్టపడి పని చేశాం. పాజిటీవ్ రిజల్ట్ వస్తుందని భావిస్తున్నాం’ అనే అంటారు. విశ్వక్ అందుకు పూర్తిగా విరుద్ధం. నిజానికి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మరి విశ్వక్ సేన్ కి ఆ మాటలు రుచించడం లేదేమో. మనం చేసిన పని మనకు బాగా నచ్చి ఉండవచ్చు. అయితే దానిని వ్యక్తం చేసే తీరు అందరికీ నచ్చేలా ఉండాలి. పెద్ద వయసేమీ కాదు కాబట్టి మున్ముందు అనుభవంతో నేర్చుకుంటాడేమో! అప్పటికీ కొంత మంది స్టేజ్ మీదే విశ్వక్ కి దూకుడు ఎక్కువ అంటూ ఇన్ డైరెక్ట్ గా తగ్గించుకోమని చెబుతుంటారు. ఉడుకు రక్తం కాబట్టి తొందరగా ఎక్కకపోవచ్చు. ఎన్టీఆర్ అంత కంటే చిన్నవయసులోనే స్టార్ డమ్ అందుకున్నాడు. అయినా పబ్లిక్ లో ఎప్పుడూ ఎక్కడా పొరపాటున కూడా మాట జారలేదు. తన పోలికలతో ఉంటాడు కాబట్టి కనీసం ఎన్టీఆర్ ను చూసి అయినా నేర్చుకుని… ఇకపై ఆచితూచి మాట్లాడతాడేమో! లెట్స్ వెయిట్ అండ్ సీ….
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి