కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి, వాచ్‌మెన్ రంగన్న మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రంగన్న మృతి గల కారణాలను సమగ్రంగా విచారించడం కోసం కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
2018 తెలంగాణ, ఒరిస్సా సరిహద్దులో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018లో తెలంగాణ, ఒరిస్సా సరిహద్దు చర్ల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయింది. ఈ ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టుల మృతి చెందిన సంగతి తెలిసిందే. బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ప్రజా హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేశాయి. చనిపోయినవారికి రీ పోస్టుమార్టం, పోలీసులపై హత్యా నేరం కింద కేసు పెట్టాలని…