National Flag Hoisted: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఆర్టీవో కార్యాలయంలో జాతీయ జెండా అవమానానికి గురైన ఘటన కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఆర్డీవో మహిపాల్ రెడ్డి జాతీయ జెండాను తలక్రిందులుగా ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది. జెండా ఆవిష్కరణ అనంతరం అక్కడ ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సూచించారు. దీంతో అప్రమత్తమైన ఆర్డీవో వెంటనే జెండాను సరిచేసి రెండోసారి సక్రమంగా ఎగరవేశారు. అయితే అప్పటికే ఈ ఘటనపై విమర్శలు మొదలయ్యాయి. Nizamabad:…