గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునికీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత విధానం కంటే ప్రామాణికమైన డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని యోచిస్తున్నారు.
బర్త్ సర్టిఫికెట్ల జారీ స్కాం లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆర్డీవో స్థాయి అధికారి అనుమతి లేకుండానే వేల సర్టిఫికెట్లు జారీచేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మీసేవా కేంద్రాల ద్వారా 22,954 సర్టిఫికెట్లు ఆర్డీఓ అనుమతి లేకుండానే జారీ అయ్యాయని గుర్తించారు. 2 వేలకు పైగా డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ కాగా.. మీ సేవ కేంద్రాల ద్వారా 31 వేల నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లుగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
నిన్న మొన్నటివరకూ ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అన్నదాతలు రోడ్డెక్కారు. తెల్ల జొన్న పంట కొనుగోలు చేయాలని కొమురం భీం చొరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. రబీలో భాగంగా సాగు చేసిన జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జిల్లా కలెక్టరేట్ కు తరలి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కొమురం…
ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జానే. అనంతలో భూఆక్రమణదారుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములా.. అసైన్డ్ భూములా అన్న తేడాలు ఏమీ లేవు.. కనిపిస్తే కబ్జా చేసేస్తామన్న ధోరణిలో ముందుకెళుతున్నారు. అయితే వీరి దాహం మరింత వికృత రూపం దాల్చి ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ ఎన్ఓసీ తెచ్చుకున్నారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వెలుగులో చూసిన కలెక్టర్ సంతకం ఫోర్జరీ సంతకం వ్యవహారం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాలో…
విశాఖలో భూవివాదం చినికి చినికి గాలివానగా మారింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు మధ్య భూ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మధురవాడలోని వివాదాస్పద భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన నిర్మాణ కంపెనీపై ఇటీవల ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. మధురవాడ సర్వే నెంబర్ 225లో కాలువపై కట్టిన కల్వర్ట్ ని అనధికారిక నిర్మాణంగా గుర్తించారు. రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు రస్తాగా నమోదు…
నోటీసులు ఇవ్వకుండానే మా ఇళ్లను కూల్చి వేస్తున్నారంటూ గోపన్ పల్లి స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ చేసేందుకు సమ యం అడిగిన ఇవ్వకుండా కూల్చి వేశారని బాధితులు వాపో యారు. 40,50 ఏళ్ల నుంచి ఇక్కడే బతుకుతున్నామన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇళ్లను కానీ, నగదును కానీ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రకళ మాట్లాడుతూ.. గోపన్‌పల్లి- తెల్లపూర్ మధ్యలో రోడ్డు నిర్మాణ పనులు…