హాట్ హాట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గుడివాడ. తాజాగా అక్కడ పోలీస్ వర్సెస్ రెవిన్యూ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. కానిస్టేబుల్ వీఆర్వో మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరుకుంది. నిన్న విజయవాడలో జరుగుతున్న అంగన్ వాడీ వర్కర్స్ నిరసనకు తన భార్యను పంపేందుకు రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు వీఆర్వో అనిల్.. నిరసనకు వెళ్తున్న అంగన్ వాడీ కార్యకర్త అయిన అనిల్ భార్యను అడ్డుకున్నారు లేడీ కానిస్టేబుల్ రమాదేవి. భార్యను అడ్డుకోవడంతో లేడీ కానిస్టేబుల్ పై దాడికి దిగారు వీఆర్వో అనిల్. దీంతో పరస్పరం దాడులకు దిగారు వీఆర్వో అనిల్, లేడీ కానిస్టేబుల్ రమాదేవి. వివాదం మరింత రాజుకుంది.
Read Also:Shahid Afridi : మోడీ సర్.. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ లు జరిపించండి..?
గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసనకు దిగారు రెవెన్యూ ఉద్యోగులు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్న జరిగిన ఘటనపై లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు వీఆర్వో అనిల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్రమంగా అరెస్టు చేసిన వీఆర్వోను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. వీఆర్ఓ పై దాడి చేసిన కానిస్టేబుల్ రమాదేవిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు రెవెన్యూ ఉద్యోగులు. దీంతో ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. కృష్ణాజిల్లాలో గన్నవరం వివాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ వివాదం ఎంతటి సంచలనం కలిగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ వివాదాన్ని అటు పోలీస్, ఇటు రెవిన్యూ ఉన్నతాధికారులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Read Also: Pathaan: హోల్డ్ టైట్… పఠాన్ వస్తున్నాడు…