Andhra Pradesh Liquor Licence: ఏపీలో బార్ల లైసెన్సులకు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-2,3 పరిధిలోని బార్ల ఈ వేలం ప్రక్రియ ఇవాళ్టితో పూర్తయ్యింది. ఇవాళ నిర్వహించిన బార్ల బిడ్డింగ్ ద్వారా రూ. 339 కోట్ల మేర ఆదాయం సమకూరింది. శని, ఆదివారాల్లో బార్ల వేలం ద్వారా మొత్తంగా రూ. 597 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బార్లకు అధికారులు ఈ వేలం నిర్వహించారు.…
Andhra Pradesh Liquor Licence: ఆంధ్రప్రదేశ్‌లో బార్ల లైసెన్సులకు బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-1, జోన్-4లలో అధికారులు బిడ్లను తెరవగా… రాయలసీమలో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. కడపలోని ఓ బార్ కోసం రూ. 1.71 కోట్లకు అత్యధిక బిడ్ దాఖలైంది. ఈ బిడ్ వైసీపీ నేత దాఖలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో రూ. 1.59 కోట్లకు బిడ్ దాఖలు కాగా.. అనంతపురంలో రూ.1.09 కోట్లతో బిడ్ దాఖలైంది. ప్రొద్దుటూరులో రూ.1.31 కోట్లకు ఓ వ్యక్తి…
రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలతోపాటు అరేబియా సముద్రం, ఆగ్నేయ, నైరుతి, ఈశాన్య బంగాళాఖాతం మీదుగా చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలతోపాటు అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, దక్షిణ…
జిల్లాల విభజనతో ఏపీ భౌగోళిక స్వరూపం మారిపోయింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడంతో పాత జిల్లాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో జిల్లాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్న జిల్లాగా మారిపోయింది. మరోవైపు రాయలసీమలో ఎన్నడూ ఊహించని మార్పులు జరిగాయి. జిల్లాల విభజన జరిగిన తర్వాత రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న…
రాయలసీమలో కీలక రాజకీయ నేతల్లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరు. అయితే ఏపీలో ఇటీవల చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై బైరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయని.. అందువల్ల రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దగా ఉంటుందని బైరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని…
ప్రజల కోర్కెలు తీర్చడంలో… ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శల దాడులకు దిగారు. రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికీ.. ఇక్కడివారు ముఖ్యమంత్రులుగా ఉన్నా అభివృద్ధి లేకుండా చేశారన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నా అభివృద్ధి శూన్యమన్నారు. 2024లో బీజేపీ…
రాయలసీమ వరప్రదాయనిగా భావించే హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకవైపు భూసేకరణ ఇబ్బందులు, మరోవైపు పనులు ముందుకు సాగడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పాత టెండర్లు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచారు. అయితే పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నాలుగు జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. 1987 లో ప్రాజెక్టుకి…
కర్నూలులో రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. అయితే ఈ సభలో… అమరావతి రైతులకు మద్దతు తెలిపిన రాయలసీమ నేతల ఇళ్లకు గాజులు, చీరలు పంపుతాం అని జేఏసీ పేర్కొంది. రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం. అలాగే మూడు రాజధానుల బిల్లు తిరిగి ప్రవేశపెట్టకుంటే సీఎం జగన్ ఇల్లు కూడా ముట్టడిస్తాం అని జేఏసీ హెచ్చరించింది.…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి- చెన్నై సమీపంలో తీరం దాటింది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతారవణ శాఖ తెలియజేసింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతారవణ శాఖ…
రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుప్తె సీమ నేతల సదస్సులో కీలక తీర్మానం చేసారు. అయితే కృష్ణానదీ యాజమాన్య బోర్డు తొలిదశలో తీసుకోబోతున్న 15 నీటి ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల లేకపోవడం అన్యాయం అన్నారు. కర్ణాటక నుండి కృష్ణా జలాలు జూరాల నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాలి. కీలక ప్రాజెక్టు కృష్ణాబోర్డు ఆధీనంలో లేకపోతే పక్క రాష్ట్రం అనధికారిక నీటివినియోగానికి పాల్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే జూరాలను బోర్డు పరిధిలోకి చేర్చాలని ఈ…