ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పలు యూనివర్సిటీలకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ ల స్థానంలో రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రసన్న శ్రీ నియామకం అయ్యారు. కృష్ణ యూనివర్సిటీ వీసీ గా ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రాంజీ నియామకం అయ్యారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ గా…
రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం సృష్టించింది.. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ చర్చగా మారింది.. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు. పరిచయ వేదిక పేరుతో హాస్టల్ లోకి ప్రవేశించిన సీనియర్లు.. సునీల్‌పై దాడి చేశారట.. అయితే, సీనియర్ల బారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో హాస్ట్‌ల్ వదిలి.. కాలేజీలో గ్రౌండ్ లో పరుగులు పెట్టాడు సునీల్..
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నియామకమయ్యారు. ప్రసాద్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన భాషా చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్ పర్సన్..లక్ష్మీ పార్వతి హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుకు ఇప్పుడు కాదు.. ఎప్పుడో అన్యాయం జరిగిందన్నారు. తెలుగు భాషమీద, సంస్కృతం మీద పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయయని వీటిని అధిగమించేందుకు, వివరంగా తెలుసుకునేందుకు యూనిర్సిటీల్లో చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. సంస్కృతం అనే పదం చేర్చడం వలన వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీషు…