డిశాలోని రాయగడ జిల్లాలోని అంబోదలా యార్డ్‌లోని వేదాంత లిమిటెడ్ ప్లాంట్‌కు శనివారం వెళ్తుండగా గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఒడిశాలోని రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పి నట్లు రైల్వే అధికారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి ఒడిశా పోలీసు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ పోలీసుల అధికారిక ప్రకటన ప్రకారం.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనను దోచుకున్నారని ఫిర్యాదు చేయడానికి రాగా.. ఒడిశా పోలీసులు నిరాకరించారని, దానికి ప్రతీకారంగా వారి వాహనాన్ని దొంగిలించానని ఈ వ్యక్తి పేర్కొన్నాడు.
ఏపీకి సంబంధించి విభజన హామీల అమలులో హంగు ఆర్భాటాలే గానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు కేంద్రం. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిమిత్తం ఇప్పటి వరకు నయాపైసా ఖర్చు పెట్టలేదు కేంద్రం.సౌత్ కోస్ట్ రైల్వే జోనుకు కేంద్రం కేటాయింపులు.. నిధుల విడుదల.. ఖర్చుల వివరాలను వెల్లడించింది కేంద్ర రైల్వే శాఖ. సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ అర్జీకి రిప్లై ఇచ్చింది కేంద్రం. 2020-21 బడ్జెట్టులో విశాఖ జోన్, రాయగఢ…