చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను సేకరించి..మర పట్టించిన తరువాత తమకు అవసరం ఉన్నంత మేర ఉంచుకుని మిగతా బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తున్నాయి. అలా రైతుల నుంచి రాష్ట్రాలు సేకరించిన మొత్తం ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర వచ్చే మూడేళ్ల అవసరాలకు సరిపడ ధాన్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బియ్యం కొనుగోలు చేయడం…
తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత. రైతులు…