CM Revanth Reddy : రాష్ట్రంలో జూన్ నుంచి ఇప్పటివరకు సగటుతో పోల్చితే 21 శాతం తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వాతావరణ శాఖ సూచనల ఆధారంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సమన్వయం…
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జులై 7న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాజధానిలోనే ఉండనున్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానం మరియు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలవనున్నారని సమాచారం. రాష్ట్రానికి కావలసిన ఎరువుల కోటాను…
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పోన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అదనపు కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వేసవి కాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా నిర్వహించి, పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వరి…
Uttam Kumar Reddy : నల్గొండ లోకసభ స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 2024 లో అందరికీ మంచి చేశాము.. 2025లో కూడా అలానే చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, స్వతంత్ర భారతదేశంలో కులగనన చేయడం మొదటి సారి అని…