Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు.
- "చట్టం తన పదును కోల్పోయింది" అంటూ కోర్టు ఆందోళన.
- నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు అవసరమని అభిప్రాయం.
- "చేతో, కాలో నరికేస్తేనే చట్టం పాటిస్తారేమో" అని వ్యాఖ్య.
- 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: అత్యాచార కేసు విచారణ సమయంలో కర్ణాటక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిందితుడిగా ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టాలంటే కఠిన శిక్షలు అవసమరని కోర్టు అభిప్రాయపడుతూ.. ‘‘ఒకరి కాలు లేదా చెయ్యి నరికివేస్తే ప్రజలు చట్టాలను పాటిస్తారేమో’’ అని వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ సమయంలో జస్టిస్ ఆర్ నటరాజ్ ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
మన దేశంలో చట్టం తన పదును కోల్పోతోందని, కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రజల్లో చట్టం పట్ల భయం పెరుగుతుందని, కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కఠిన శిక్షల కారణంగా ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడుతారు అని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి తరుపున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ దాదాపుగా రెండు నెలల నుంచి జైలులో ఉన్నాడని, తాను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నాడని వాదించారు.
Also Read
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే అని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిందితుడు మరికొన్ని రోజులు జైలులో ఉండొచ్చని, భవిష్యత్తులో శిక్ష పడితే మళ్లీ జైలుకు వెళ్లా్ల్సి రావచ్చని అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. ఈ కేసు మూడేళ్ల క్రితం నాటిది. నిందితుడు ఒక యువతిని స్నేహం పేరుతో మాట్లాడుకుందామని చెప్పి ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడు. 2023 సెప్టెంబర్ 12న లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 375(a), 376 కింద నమోదు చేశారు. ఈ కేసులో ఉడుపి జిల్లా సెషన్స్ కోర్టు ఇప్పటికే నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!