Rice Scheme: మార్కెట్ కంటే కిలోకు రూ.10 తక్కువకే బియ్యం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన అమ్మకాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Govt Launches Subsidized Rice Sales: రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తక్కువ ధరల బియ్యం విక్రయాలను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు సబ్సిడీ ధరలో బియ్యాన్ని పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ తక్కువ ధరల బియ్యం అమ్మకాలు ప్రారంభమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.62కు విక్రయిస్తుండగా.. ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో అదే బియ్యాన్ని రూ.52కే అందిస్తున్నారు. అలాగే మార్కెట్లో రూ.58 ఉన్న బీపీటీ రా బియ్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో రూ.50కే విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్ ధరతో పోలిస్తే ప్రజలకు కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు ఆదా కానుంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల విక్రయ కౌంటర్ల ద్వారా తక్కువ ధరల బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల భారం నుంచి కొంత ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోని రైతు బజార్లు, రైస్ మిల్లుల కౌంటర్లలో ఈ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!