కాబోయే భర్తే కదా అనుకోని ఆ పనికి ఒప్పుకున్న యువతి.. కానీ, చివరికి ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్తే కదా అని నమ్మిన ఆ యువతిని ఆ నీచుడు నట్టేట ముంచాడు. డబ్బు కోసం కాబోయే భార్య నగ్న వీడియోలనే ఎరగా వేశాడు. దీంతో తట్టుకోలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్ మెంట్ కూడా త్వరలో ఉండడంతో కార్తీక్, ప్రగతి ఫోన్లో మాట్లాడుకొనేవారు. కార్తీక్ ఆమెను ఎప్పుడు నగ్న వీడియోలు చేయమని బలవంతపెట్టేవాడు. కాబోయే భర్తే కదా అని ఆమె కూడా నో చెప్పకుండా న్యూడ్ కాల్స్ చేసింది. ఈ కాల్స్ ని ఆమెకు తెలియకుండా కార్తీక్ రికార్డు చేశాడు. ఇక ఇటీవల ఇండియా వచ్చిన కార్తీక్, ప్రగతితో చనువుగా మాట్లాడుతూ, ఫోటోలు తీసుకున్నాడు.
ఇక ఈ నేపథ్యంలోనే కట్న కానుకల విషయంలో ఇరు కుటుంబ సభ్యులకు బేధాభిప్రాయాలు రావడంతో అమ్మాయి తరుపువారు సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.దీంతో కార్తీక్ రెచ్చిపోయాడు.. తాము అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి చేయకపోతే ప్రగతి నగ్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆ ఫోటోలు బయటపడితే పరువు పోతుందని భయపడిన ప్రగతి అక్టోబర్ 18న అర్ధరాత్రి ఇంట్లో ప్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తీక్ ని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కి తరలించారు.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!