(జూలై 17న రంగనాథ్ జయంతి) సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా? అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది. ప్రతిభావంతులకు ఏదో ఒకరోజున తారాపథం తివాచీ పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ విషయంలో నిజమయ్యాయని ఒప్పుకోక తప్పదు. రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు. అదే ఆయనను కవిగా మార్చిందని…