వెంకీ అట్లూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలుత నటుడిగా కొన్ని సినిమాలు చేసిన ఆయన, తర్వాత దర్శకుడిగా మారి తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ‘తొలిప్రేమ’ అంటూ వరుణ్ తేజ్‌తో హిట్ కొట్టిన ఆయన, తర్వాత అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమా చేసి పరాజయం పొందారు. ‘రంగ్ దే’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, తర్వాత చేసిన ‘సార్’…
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్, రంగ్ దే అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. “చెక్” చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. “చెక్”లో తప్పుడు ఆరోపణలతో ఉగ్రవాదిగా నిరూపితమైన ఆదిత్యకు మరణశిక్ష ఖరారవుతుంది. అయితే ఆదిత్య జైలులో చెస్ నేర్చుకుంటాడు. ఛాంపియన్ తో ఆడి గెలుస్తాడు కూడా. కానీ అతను…
అ ఆ మూవీ తర్వాత నితిన్ కెరీర్ లో మరో చక్కని విజయాన్ని అందుకున్న సినిమాభీష్మనే. ఎన్నో పరాజయాల తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అ ఆ నితిన్ కెరీర్ కు కొత్త ఊపిరి పోసినట్టుగా, లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాల పరాజయం తర్వాత నితిన్ కు భీష్మ మంచి విజయాన్ని అందించి, అతని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత ఈ యేడాది వచ్చిన చెక్, రంగ్ దే చిత్రాలు…
టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా కరోనా కారణంగా ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలావుంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇందులో నభా నటేష్ హీరోయిన్ కాగా తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.…