టాలీవుడ్ హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా కరోనా కారణంగా ఆశించినంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇదిలావుంటే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ప్రస్తుతం నితిన్ ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఇందులో నభా నటేష్ హీరోయిన్ కాగా తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక కీర్తి సురేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది.