హైదరాబాద్ సినీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగాల్లో కలకలం సృష్టించిన బెట్ యాప్ స్కామ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రివెంజన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 29 మంది ప్రముఖులు ఈడీ యొక్క జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారిలో ప్రముఖ టాలీవుడ్ నటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లు ఉన్నారు.…