హైదరాబాద్ సినీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగాల్లో కలకలం సృష్టించిన బెట్ యాప్ స్కామ్ ఇప్పుడు మరో మలుపు తిరిగింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రివెంజన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే 29 మంది ప్రముఖులు ఈడీ యొక్క జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారిలో ప్రముఖ టాలీవుడ్ నటులు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లు ఉన్నారు.
Also Read : Allu Arjun : బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్!
కాగా, ఇప్పటికైతే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖి ఈ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, ఇంకా చాలా మంది పేర్లు బయటకు రాలేదు.. త్వరలోనే వారి పేర్లు కూడా బటయకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, బెట్టింగ్ యాప్‌ల ద్వారా పలువురు సెలబ్రిటీలకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ సెలబ్రిటీలు ఈ యాప్‌కు ప్రమోషనల్ వీడియోలు చేసినందుకు వారి అకౌంట్లకు డబ్బులు వెళ్లినట్లు తేలుతుండగా, ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది.. పన్ను చెల్లింపులు, బిల్లింగ్ వివరాలపై విచారణ కొనసాగుతోంది.
అయితే, సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో అవెయిడ్ (Avid) టెక్ కంపెనీ ద్వారా నడపబడుతున్న బెట్టింగ్ యాప్ గురించి సమాచారం లభించింది. యాప్ ద్వారా నకిలీ అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు చేతులు మారినట్లు గుర్తించారు. విచారణలో ఈ యాప్ ప్రమోషన్‌కు పలువురు సెలబ్రిటీలు పాలుపంచుకున్నట్లు ఆధారాలు లభించాయి. విచారణ కోసం పలువురు సెలబ్రిటీలు నోటీసులకు హాజరుకావాల్సి ఉంది. బ్యాంకు లావాదేవీలు, పన్ను చెల్లింపుల రికార్డులు, ప్రమోషన్స్ కు తీసుకున్న పారితోషికం వివరాలు పరిశీలించనున్నారు. అవసరమైతే ఈడీ స్వయంగా ఈ సెలబ్రిటీల నివాసాల్లో సోదాలు చేయవచ్చని టాక్.