సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎప్పటికి మర్చిపోలేని సినిమా నరసింహ.. రజినీ స్టైల్, రమ్యకృష్ణ పొగరు, సౌందర్య అందం.. వెరసి ఈ సినిమా ఒక చార్ట్ బస్టర్. ఇప్పటికి ఎక్కడో ఒకచోట ఈ సినిమాలోని సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా రజినీ, రమ్యకృష్ణ ల మధ్య రివెంజ్ సన్నివేశాలు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక అలాంటి నెం. 1 జోడీ మళ్ళీ రిపీట్ కానుందని సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో…
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. అప్పటి నుంచీ సినీఫ్యాన్స్ ‘బాహుబలి-2’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారి ఆసక్తికి…
కె.రాఘవేంద్రరావు, ఆయన అన్న కె.కృష్ణమోహనరావు కలసి తమ ఆర్.కె.అసోసియేట్స్ పతాకంపై టాప్ స్టార్స్ తో పలు చిత్రాలు తెరకెక్కించారు. మోహన్ బాబుతో వారు నిర్మించిన ‘అల్లరి మొగుడు’ చిత్రం భలేగా అలరించింది. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావే దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న ‘అల్లరి మొగుడు’ జనం ముందు నిలచి, వారి మనసులు గెలిచింది. ‘అల్లరి మొగుడు’ కథ ఏమిటంటే- గోపాల్ హార్మోనియం చేతపట్టుకొని పట్నం చేరతాడు. అతనికి తబలా వాయించే సత్యం తోడవుతాడు. వారిద్దరూ కలసి…
‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన…
రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తుండగా.. మంచి టీఆర్పీలను సొంతం చేసుకుంటోంది. తెలుగు బిగ్‌బాస్ షోను హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మరోవైపు తమిళంలోనూ బిగ్‌బాస్‌కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తమిళంలో ఈ షోకు ప్రముఖ హీరో కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో బిగ్‌బాస్‌కు ఎవరు యాంకర్‌గా వ్యవహరిస్తారన్న విషయంపై అందరిలోనూ…
అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషియో ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలోని “లడ్డుండా” అనే మాస్ సాంగ్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. నాగ్ స్వయంగా పాటను పాడాడు. నాగ్ సరదాగా ఈ సాంగ్ ను పాడినప్పటికీ తన గాత్రంతో ఈ సాంగ్ స్టైల్‌గా మారింది. మొదట్లో ఆయన చెప్పిన గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “లడ్డుండా” పాటను నాగ్ తో పాటు చిత్రంలోని రంభ, ఊర్వశి,…
సుప్రీమ్ హీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 22న ఈ సినిమా తాజా ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొనబోతున్నట్టు అధికారిక సమాచారం. మేనల్లుడు సాయితేజ్ అంటే పవన్ కళ్యాణ్ కు అంతులేని అభిమానం. అతన్ని ‘రేయ్’ సినిమాతో…
ఎట్టకేలకు కింగ్ నాగార్జున “బంగార్రాజు” పట్టాలెక్కింది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’లో నాగ్ బంగార్రాజు పాత్రకు సూపర్ క్రేజ్ లభించింది. అప్పట్టోనే దానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ టైటిల్ తో సినిమా తీస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, నాగ చైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… తదితర అంశాలతో ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ…