తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ హెడ్‌మాస్టర్ అబ్దుల్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేశారు.