Merugu Nagarjuna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులను వివరించేందుకు డీజీపీ ఆఫీస్ కి వచ్చామని వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇక, పులివెందుల ఉప ఎన్నికలో జరుగుతున్న పరిణామాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లాం.. అయినా స్పందన లేదు.. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మా పార్టీ వారిని భయబ్రాంతులకు గురి చేసే కుట్ర చేస్తున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రాజుకుంటూనే వున్నాయి. అనుచరుడిగా ఉంటారని ఆ ఎమ్మెల్యే కోరి తెచ్చుకున్న వ్యక్తి ఆయనకే కొరగాని కొయ్యగా మారిపోయాడు. మారిన పరిణామాలతో ఆ అనుచరుడికి ఊహించని పదవి వచ్చింది. దీంతో అధికారపార్టీలో వర్గవిభేదాలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అధిష్ఠానానికి తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. రాచమల్లు, రమేష్ మధ్య మలుపులు తిరుగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఆవిర్భావంతో లోకల్ పాలిటిక్స్ మారిపోయాయి. అప్పటిదాకా పోటీ టీడీపీ, కాంగ్రెస్…
గణపతి ఉత్సవాల్లో బాలాపూర్ గణపతికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతీ ఏడాది బాలాపూర్ గణపతి లడ్డూను వేలం వేస్తారు. 2019లో రూ.17 లక్షలకు పైగా పలికిన బాలాపూర్ లడ్డూ, ఈ ఏడాది మరింత అధిక ధరను సొంతం చేసుకుంది. బాలాపూర్ లడ్డూ వేలంలో కడప జిల్లాకు చెందిన మర్రి శశిధర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌లు రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ లడ్డూను త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు.…
ఆయన ఎమ్మెల్సీ అయ్యి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు అదేపనిగా ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. ఆ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇంతకీ ఎమ్మెల్సీని బెదిరిస్తున్నది ఎవరు? ఏమని వార్నింగ్ ఇస్తున్నారు? ఎమ్మెల్సీకి ఎవరిపై అనుమానాలు ఉన్నాయి? లెట్స్ వాచ్! ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అవుదామని రాజకీయాల్లోకి వచ్చారు! ఏపీలో ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన నలుగురిలో ఆర్. రమేష్ యాదవ్‌ను ఎంపిక చేయడం పార్టీ వర్గాలను…
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో కొత్తగా ఎంపిక కానున్న ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. సాయంత్రం తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో…