తన గత చిత్రాలకు పడనంత టెన్షన్ 'వాళ్ళిద్దరి మధ్య' సినిమాకు పడ్డానని ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
(ఆగస్టు 30న రమేశ్ ప్రసాద్ పుట్టినరోజు) ఓ వైపు హైటెక్ సిటీ, మరో వైపు ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ భాగ్యనగరానికి మరింత శోభను తీసుకు వచ్చాయి. ప్రసాద్ సంస్థ తెలుగు చిత్రసీమలోనే కాదు భారతీయ చలనచిత్ర రంగంలోనే ఓ చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు మరెవరో కాదు ప్రఖ్యాత దర్శకనిర్మాత, నటుడు ఎల్.వి.ప్రసాద్. ఆయన నెలకొల్పిన ప్రసాద్ సంస్థలు అనేకం చిత్రసీమలో వేళ్లూనుకున్నాయి. హైదరాబాద్ లో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ విషయం అందరికీ తెలిసిందే.…
కరోనా కారణంగా థియేటర్లను క్లోజ్ చేయడాన్ని కొందరు ఎగ్జిబిటర్స్ తమకు అనుకూలంగా మలచుకున్నారు. అందులో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కూడా ఒకటి. గతంలో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటుగా ఉండేది. వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు చేసేదీ ఇదే. హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఒకటిగా మారింది. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు.…