Ramchander Rao : మోడీని కూడా కన్వర్టెడ్ బీసీ అని విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశాడు.. కానీ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా…
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రామచందర్ రావు, గద్వాలలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపిపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని, రైతుల సమస్యలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆయన ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత గద్వాలకు మొదటిసారి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Also Read:Bandi Sanjay: ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా,…
Ramchander Rao : పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదన్నారు. కానీ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు రేవంత్ రెడ్డికి సమయం ఇచ్చారని, మీ పార్టీ ముఖ్యమంత్రి కి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు చెప్పాలన్నారు…
కొత్త అధ్యక్షుడిని డమ్మీ డమ్మీ అని అందరన్నారని.. తాను డమ్మిని కాదు మమ్మీకి డాడీని అన్న రామ్ చందర్ రావుకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానన ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామ్ చందర్ రావుకు ఇది మంచి అవకాశమన్నారు. ఫాతిమా కాలేజ్ పై లీగల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని.. లీగల్ టీమ్ తో హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసీ ఫాతిమా కాలేజ్ కూల్చేందుకు కొట్లాడాలని తెలిపారు. హైడ్రా వల్ల అనేక పేద…
Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండే పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. శనివారం నాడు అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి.. ఉదయం 10 గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
Ramchander Rao: ఎంతో మంది కార్యకర్తల త్యాగాల ఫలితంతోనే బీజేపీ ఈ స్థాయికి చేరుకుంది అని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. నాకు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇవ్వడం గర్వంగా భావిస్తున్నాను.. ప్రతి కార్యకర్త గర్వించాలి.. అందరం కలిసి కట్టుగా పని చేద్దాం అని పిలుపునిచ్చారు.
Beerla Ilaiah: రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపుతూ ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై బీఆర్‌ఎస్, బీజేపీ మైత్రి మరోసారి బయటపడిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి “అవయవ దానం” చేసిందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు లాంటి బలహీన వ్యక్తిని నియమించడం…