Ramchander Rao : మోడీని కూడా కన్వర్టెడ్ బీసీ అని విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశాడు.. కానీ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా ఉన్నారని, కుల గణన కొన్ని మండలాల్లో జరగనే లేదు.. ఎలా పూర్తిచేశారన్నారు రాంచందర్ రావు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తే నిజాలు ఎందుకు బయపెట్టడంలేదని, అందుకే కేంద్ర ప్రభుత్వం జన గణనతో పాటు కుల గణన కూడా చేపట్టనుందన్నారు. అందులో వాస్తవాలు చెప్పి దాని ప్రకారం సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని, రాజ్యాంగం మారుస్తారని, ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తారని అమిత్ షా మాట్లాడినట్లు కాంగ్రెస్ సృష్టించిందన్నారు రాంచందర్ రావు.
Tummala Nageswara Rao : పత్తిరైతులకు గుడ్ న్యూస్.. బిల్లులు విడుదల..!
ఈ కేసు సీఎంపైనే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తామని, 42 శాతం పక్కాగా ఓన్లీ బీసీలకే ఇస్తామన్నారు. కాంగ్రెస్ చెబుతున్నట్లుగా వాటిలో కూడా 10 శాతం ముస్లింలకు ఇవ్వబోమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బీసీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రం ముందుకు వెళ్తుంటే తమకు నష్టమని భావించి కాంగ్రెస్ దుష్ప్రచారాలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. ఎలక్షన్స్ ముందు సీఎం రేవంత్ ఇచ్చిన స్టేట్ మెంట్లు బయటపెడతాం.. ఆయన ఏం మాట్లాడాడో బయటపెడతామని ఆయన వ్యాఖ్యానించారు.
బీసీల సంక్షేమంపై కాంగ్రెస్ చేసేదంతా యాక్టింగే అని, వచ్చేనెల 2వ తేదీన ధర్నా చౌక్ వద్ద బీసీ రిజర్వేషన్లపై మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. బీసీల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమే అని, కాంగ్రెస్ కేవలం ఓట్ల కోసమే ఆలోచిస్తుంది.. కానీ బీజేపీ ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు రాంచందర్ రావు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో బీసీల పాత్ర కీలకం.. వారికి అంతేస్థాయిలో ప్రయారిటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
War 2 Event : విజయవాడలో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. క్లారిటీ..