బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామంలోని ఒక వ్యక్తి అందరితో మంచిగానే ఉంటు కొద్ది రోజులుగా పూజలు నిర్వహిస్తున్నాడని గ్రామస్తులు గమనించినా అంతలా పట్టించుకోలేదు. అయితే రాను రాను అంతను చేస్తున్నది క్షుద్రపూజలు అని తెలియగానే ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు.