రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో రంజాన్ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు.. నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని వారితో కలిసి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా.. పిల్లలతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంజాన్ మాసం పూర్తయిన తర్వాత షవ్వాల్ నెల (ఇస్లామిక్ క్యాలెండర్ 10వ నెల) మొదటి తేదీన ఈద్ పండుగ జరుపుకుంటారు. దీనిని ఈద్-ఉల్-ఫితర్, ఈద్-అల్-ఫితర్, మిథి ఈద్ లేదా రంజాన్ ఈద్ అని కూడా పిలుస్తారు.
ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం నెలవంక దర్శనం ఇచ్చింది. దీంతో 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. భారతదేశం, పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి.