తెలుగు చిత్రసీమలో చిరస్మరణీయులు మూవీ మొఘల్ డి.రామానాయుడు. ఆ పేరు తలచుకోగానే ఆయన సాధించిన అపూర్వ విజయాలు ముందుగా గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోనే అత్యధిక కథా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన తీరు మన మదిలో మెదలుతుంది. భారతదేశంలోని 14 భాషల్లో 12 ప్రముఖ భాషల్లో చిత్రాలను నిర్మించి, దేశంలోనూ ఘనతను సాధించారు. అనితరసాధ్యంగా రామానాయుడు సాగిన తీరును గుర్తు చేసుకుంటే మనసు పులకించి పోవలసిందే. అందుకే భావి నిర్మాతలెందరో ఆయననే ఆదర్శంగా…