Ram Mandir Holiday: రేపు(జనవరి 22)న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి యావత్ దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమం జరిగే అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. రామ్ లల్లా(బాల రాముడి) ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధాని ముఖ్యపోషకుడి హోదాలో ఈ కార్యక్రమానికి హాజవుతున్నారు. మరోవైపు దేశంలోని బిజినెస్, సినీ, స్పో్ర్ట్స్, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో సహా…
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే సన్నాహాలు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఆలయంలో కొలువుదీరే బాలరాముడికి ఆఫ్గనిస్థాన్‌తో సహా ప్రపంచం నలుమూలల నుంచి కానుకలు భారీగా వస్తున్నాయి.
Ayodhya : అయోధ్యలో 500 ఏళ్ల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాముడు తన తాత్కాలిక డేరా నుండి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించనున్నారు. సుమారు ఐదు వందల సంవత్సరాల తర్వాత రాముడు తన ఆలయానికి తిరిగి వస్తున్నాడు.
రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. దాంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. తపాలా స్టాంపు రూపకల్పనలో రామాలయం, చౌపాయి 'మంగల్ భవన్ అమంగల్ హరి', సూర్య, సరయూ నది, ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవి.. భారతదేశం, అమెరికాతో సహా మొత్తం 21 దేశాలలో విడుదలయ్యాయి.
తాజాగా టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి అయోధ్య రామ మందిర ఆహ్వానం అందింది. ఈ మేరకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.
Ram Mandir : జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని పవిత్రోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు.
అయోధ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ ఆలయంలో రాంలల్లా ప్రాణప్రతిష్ట కోసం భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యకు ప్రతి రోజూ మూడు లక్షల మందికి పైగా ప్రజలు సందర్శిస్తారని అంచనాలు వేస్తున్నారు.
Ram Temple: దేశవ్యాప్తంగా అంతా రామమందిర ప్రారంభోత్సవంపైనే చర్చ నడుస్తోంది. హిందువులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అయోధ్య భవ్య రామమందిరంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగబోతోంది. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వేడుకలు ప్రారంభమయ్యాయి.
Badruddin Ajmal: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో దీన్ని ఉద్దేశిస్తూ.. ముస్లింలు జనవరి 20 నుంచి 26 వరకు ఇళ్లల్లోనే ఉండాంటూ పిలుపునిచ్చారు. రామమందిర ప్రతిష్టాపన సమయంలో రైళ్లలో ప్రయాణించకూడదని కోరారు. ముస్లింలకు బీజేపీ శత్రువు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.