Ayodhya Ram temple: అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22న రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే కొంతమంది దుండగులు మాత్రం రామాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై బాంబుదాడులు చేస్తామని బెదిరించారు.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను వేధిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అల్లర్లతో సంబంధం ఉన్న వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేయడంపై బీజేపీ మండిపడుతోంది. బాబ్రీ కూల్చివేత తర్వాత హుబ్బళ్లీలో జరిగిన రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. హిందూ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటుందని మంగళవారం ఆరోపించింది. ఈ అరెస్టును హిందువులపై వేటగా అభివర్ణించింది.
Ayodhya Ram Mandir : రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు సంఘ్ పెద్ద విజ్ఞప్తి చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్ మసీదులు, దర్గాలు, మదర్సాల నుండి పవిత్రోత్సవం రోజున 'శ్రీ రామ్, జై రామ్, జై జై' అని నినాదాలు చేయాలని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రోడ్‌షో నిర్వహించి పునరాభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆవిష్కరించిన అనంతరం కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి ఉత్తరప్రదేశ్ కోసం అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
NCP Chief Sharad Pawar Said I has not received an invitation of Ram Temple Inauguration: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఏదేమైనా రామాలయం ఏర్పడైనందుకు చాలా సంతోషిస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు. రామ…
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
BJP: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. జనవరి 22, 2024లో అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ, కార్యకర్తలను కోరింది.
Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామ మందిర పూజారి పదవికి 3000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 200 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు. మకర సంక్రాంతి తర్వాత 22 జనవరి 2024న ఎంపికైన పూజారులు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
Ayodhya: అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని చూస్తున్నారు అధికారులు. ఇప్పటికే మందిర నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. డిసెంబర్ పూర్తి అయ్యే నాటికి మందిర నిర్మాణం పూర్తి చేసేలా పనులను శరవేగంతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఓ శుభవార్త వెలువడింది. అయోధ్య రామమందిరం లోని రాముని దర్శనం 2024 జనవరి నుండి మొదలవుతుంది. భక్తుల కోసం వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ నుండి 24వ తేదీ మధ్యన రాములవారి…