అయోధ్యలో రామ మందిరం త్వరలో సిద్ధమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఆలయ నిర్మాణంలో హిందూ ఆధ్యాత్మిక నాయకుడు జగద్గురు రాంభద్రాచార్యుల సహకారాన్ని కొనియాడారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు ముందు, ట్రస్ట్ ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2023.
అయోధ్యలో మూడంతస్తుల రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని, జనవరి 22న పవిత్రోత్సవం జరగనుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 20-24 మధ్య ఏదైనా రోజున 'ప్రాణ ప్రతిష్ఠ'కు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని భావిస్తున్నామన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతిష్టాత్మకంగా సాగుతోంది… మరోవైపు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. అయోధ్యలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉదయం 11 గంటలకు పర్చువల్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రధాని.. ఈ సమావేశానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు.. అయోధ్యలో రామ్ మందిరం కోసం భూమి కొనుగోలుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.. రామ్ మందిర్…
అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ సేకరించిన 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి. చెక్కుల విలువ సుమారు 22 కోట్లుగా ఉంటుందని మందిర ట్రస్ట్ తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు లేకపోవడం,సాంకేతిక సమస్యల కారణంగా చెక్కులు బౌన్స్ అయినట్లు వెల్లడించింది. సాంకేతిక లోపాలు సవరించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ సభ్యులు ఒకరు తెలిపారు.కాగా ఈ చెక్కుల్లో దాదాపు 2 వేల చెక్కులు అయోధ్య నుంచి వచ్చినట్లు చెప్పారు. జనవరి 15…