West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం రామ నవమి సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో రాళ్లతో దాడి చేసిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
రామ నవమి వేడుకల్లో ఓ వ్యక్తి పిస్టల్ తో హల్ చల్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమబెంగల్ లో జరిగింది. హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా 22 ఏళ్ల యువకుడిని మంగళవారం పిస్టల్‌తో పట్టుకున్న వీడియో వైరల్ కావడంతో అరెస్టు చేశారు.
Ram Navami Procession: శ్రీరామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించడంపై జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హజారీబాగ్ లో రామనమవి ఉరేగింపుల్లో డీజే వాడొద్దని, సంప్రాదాయ కర్రల విన్యాసాలు చేయొద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనిపై మంగళవారం జార్ఖండ్ అసెంబ్లీలో రచ్చ జరిగింది. బీజేపీ సభ్యులు జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. జార్ఖండ్ రాష్ట్రం తాలిబాన్ల పాలనలో ఉందా.? అంటూ బీజేపీ సభ్యులు ప్రశ్నించారు.